kalyan ram: కొత్తగా కనిపించిన కల్యాణ్ రామ్ .. మరింత అందంగా అనిపించిన కాజల్!

  • ఈ రోజే విడుదలైన 'ఎమ్మెల్యే'
  • లుక్ పరంగా కల్యాణ్ రామ్ కి మంచి మార్కులు 
  • గ్లామర్ తో కట్టిపడేసిన కాజల్  

కల్యాణ్ రామ్ .. కాజల్ జంటగా దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన 'ఎమ్మెల్యే' సినిమా .. ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ పైనే కల్యాణ్ రామ్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. చాలాకాలం తరువాత కల్యాణ్ రామ్ .. కాజల్ జంటగా చేసిన చిత్రం ఇది.

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు .. ఇంతకుముందు సినిమాల్లోకంటే ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కొత్తగా కనిపించాడని అంటున్నారు. నటన పరంగా కూడా ఆయన కొత్తదనాన్ని చూపించడానికి ట్రై చేశాడని చెబుతున్నారు. ఇక కాజల్ విషయానికొస్తే .. గతంలో కంటే ఆమె ఈ సినిమాలో మరింత గ్లామర్ గా కనిపించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె గ్లామర్ ఈ సినిమా ప్రధానాంశాల్లో ఒకటిగా నిలిచిందని చెబుతున్నారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనీ .. మంచి కంటెంట్ తో మార్కులు కొట్టేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

More Telugu News