పార్లమెంటులో రేపు జరగబోతున్నది ఇదే: హీరో శివాజీ
- అవిశ్వాసంపై చర్చను చేపడతారు
- కేంద్రం తరపున ఆరుగురు మాట్లాడతారు
- చివరకు అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తారు
ఈ ఆరు మంది కూడా అనర్గళంగా ధడ్ ధడ్ లాడిస్తారని... ఏపీకి అంతా చేసేశామని చెప్తారని తెలిపారు. మన ఎంపీలకు ఇంగ్లీషు పెద్దగా రాదనే భావన ఢిల్లీలో ఉందని అన్నారు. వీరంతా మాట్లాడిన తర్వాత అవిశ్వాసాన్ని వ్యతిరేకించే వారు చేయెత్తాలని స్పీకర్ అడుగుతారని, అనుకూలంగా ఉండేవారు చేయెత్తాలని అడుగుతారని చెప్పారు. చివరకు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉండేవారే ఎక్కువగా కనిపిస్తున్నారంటూ... అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తారని తెలిపారు.