Lok Sabha: పార్లమెంటులో మారని చిత్రం... ముందుకు పోని అవిశ్వాస తీర్మానం... ఉభయ సభలు వాయిదా

  • టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యుల నిరసనలు
  • నిర్ణయం తీసుకోలేనన్న స్పీకర్ సుమిత్రా మహాజన్
  • రాజ్యసభలోనూ అదే పరిస్థితి

పార్లమెంటు సమావేశాలు ఈ రోజు కూడా సభ్యుల నిరసనలతో ఏమాత్రం జరగలేదు. వివిధ అంశాలపై కాంగ్రెస్, అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలకు దిగారు. సభ ఆర్డర్ లో లేనందున టీడీపీ, వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాాల విషయంలో ముందుకు వెళ్లలేనంటూ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. సభ్యుల నినాదాలతో సభ నిర్వహించలేని పరిస్థితి ఉండడంతో రేపటికి వాయిదా వేశారు.

అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ ఆమోదించకుండా దాటవేయడం ఇది నాలుగోరోజు. కావేరీ అంశంపై అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి. దీంతో గ్రాట్యుటీ బిల్లు ఆమోదం తర్వాత సభను వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అసభ్యకర సన్నివేశాలను దేశ ప్రజలు చూడాలని తాను భావించడం లేదన్నారు.

More Telugu News