Madhya Pradesh: రేపిస్టు లెంపలు వాయించిన బాధిత యువతి తల్లి..వైరల్ వీడియో

  • ఇండోర్ లో యువతిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు
  • యువకుడ్ని అరెస్టు చేసిన పోలీసులు
  • నిందితుడ్ని చూడగానే తీవ్ర ఆగ్రహానికి లోనై లెంపలు వాయించిన బాధితురాలి తల్లి
తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి జుట్టు పట్టుకుని నడిరోడ్డుపై చెంపలు వాయించిన ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోకు చెందిన యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత యువతిని వైద్యపరీక్షలకు పంపి, నిందితుడ్ని అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న బాధిత యువతి తల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. స్టేషన్ లో నిందితుడిని చూడగానే పట్టరాని ఆగ్రహంతో నడిరోడ్డుపై అతని జుట్టుపట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించింది. దీనిని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, వీడియో వైరల్ అవుతోంది.
Madhya Pradesh
indore
rapist
rape victime
Viral Videos

More Telugu News