allu arjun: అల్లు అయాన్ 'రంగస్థలం' చిట్టిబాబుగా మారిపోయాడండోయ్!

  • 'రంగస్థలం'లో చిట్టిబాబుగా చరణ్ 
  • ఆయన లుక్ కి ఒక ప్రత్యేకత 
  • ఆ లుక్ తో బన్నీ తనయుడు  
తెలుగు తెరపైనే కాదు .. సోషల్ మీడియాలోనూ అల్లు అర్జున్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. సందర్భానికి తగినట్టుగా ఆయన తన పిల్లల ఫోటోలను షేర్ చేయడంలోనూ ముందుంటాడు. తాజాగా ఆయన అల్లు అయాన్ ఫోటో ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో అల్లు అయాన్ 'రంగస్థలం' సినిమాలో 'చిట్టిబాబు' మాదిరిగా కనిపిస్తున్నాడు.

 'రంగస్థలం' సినిమాలో చరణ్ .. 'చిట్టిబాబు' పాత్రను పోషించాడు. ఈ పాత్రలో ఆయన గళ్ల లుంగీ పైకి కట్టి  .. గళ్ల చొక్కా . .  రంగు బనీన్ తో మెడలో టవల్ వేసుకుని కనిపిస్తాడు. అల్లు అర్జున్ దంపతులు అల్లు అయాన్ కి అలాంటి బట్టలే వేసి .. అతణ్ణి  'చిట్టిబాబు' లుక్ తో అభిమానుల ముందుంచి తమ ముచ్చట తీర్చుకున్నారు. ఇక తమ అభిమాన హీరో అల్లు అర్జున్ తనయుడిని 'చిట్టిబాబు' లుక్ లో చూస్తూ ఆయన అభిమానులు మురిసిపోతున్నారు.      
allu arjun
allu ayaan

More Telugu News