శ్రుతి హాసన్ తో గొడవేంటని నేను అడగలేదు: దిశా పటాని
- శ్రుతి హాసన్ నాకంటే సీనియర్
- ఆమె కంటే తక్కువ సినిమాలు చేశాను
- నేను రావడానికి ముందు ఏం జరిగిందనేది నాకు తెలియదు
శ్రుతి హాసన్ ను రీ ప్లేస్ చేశారు .. ఎలా అనిపిస్తోంది? అనే ప్రశ్న ఆమెకి మీడియా ద్వారా ఎదురైంది. అందుకామె అసహనానికి లోనవుతూ "శ్రుతి హాసన్ నా కన్నా సీనియర్ .. ఆమెను రీ ప్లేస్ చేయడానికి నేను ఎవరిని ?" అంటూ దిశా ఎదురు ప్రశ్న వేసింది. శృతితో పోల్చుకుంటే నేను చేసిన సినిమాలు తక్కువ. ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర కోసం నన్ను సంప్రదించారు .. నేను ఓకే చెప్పాను. అంతకుముందు శృతికి .. యూనిట్ కి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు .. తెలుసుకోవడానికి నేను ప్రయత్నించలేదు. ఆ సంగతులు తెలుసుకోవాలంటే డైరెక్టర్ ను కలవండి" అంటూ తేల్చి చెప్పేసిందట.