paritala sunita: మేము ఎన్డీఏ నుంచి బయటికొచ్చాక మీకు అవినీతి కనపడిందా?: బీజేపీపై పరిటాల సునీత ఫైర్

  • ఏపీ సర్కారుపై విష్ణుకుమార్ రాజు ఆరోపణలు
  • కౌంటర్‌ ఇచ్చిన పరిటాల సునీత
  • పట్టిసీమ అద్భుతంగా ఉందని గతంలో విష్ణుకుమార్ రాజు అన్నారని వ్యాఖ్య
  • ఇప్పుడు 'అవినీతి' అంటూ ఎలా మాట్లాడారో అర్థం కావట్లేదని విమర్శ
ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చాక బీజేపీ నేతలకు ఏపీలో అవినీతి కనపడిందా? అని ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. ఈ రోజు శాసనసభలో బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రూ.190 కోట్లు పట్టిసీమలో వృథాగా ఖర్చు పెట్టారని కాగ్ ఆరోపించిందని తెలుపుతూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ.. పట్టిసీమ అద్భుతంగా ఉందని గతంలో విష్ణుకుమార్ రాజు అన్నారని, ఇప్పుడు ఈ విధంగా ఎలా మాట్లాడారో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతోనే బీజేపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని భావిస్తున్నామని అన్నారు. పట్టిసీమ వల్ల ఇప్పుడు రాయలసీమకు తాగు, సాగు నీళ్లు అందుతున్నాయని చెప్పారు. 
paritala sunita
Telugudesam
Vishnu Vardhan raju

More Telugu News