Chandrababu: జపాన్‌ తరహా పోరాటం.. ప్రతిరోజు అర్ధగంట నిరసన.. మరో గంట ఎక్కువ పనిచేద్దాం: చంద్రబాబు పిలుపు

  • కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందేవరకు నిరసనల్లో పాల్గొంటాం
  • అవసరమైతే నల్లబ్యాడ్జీలు పెట్టుకుందాం
  • నిరసనల్లో భాగంగా నిరాహార దీక్షలు కూడా చేద్దాం
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి సాయం అందేవరకు తాము కూడా నిరసనల్లో పాల్గొంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ రోజు ఆయన అమరావతిలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై పోరాడే క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రాష్ట్రాభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందని అన్నారు. అందుకే జపాన్ తరహాలో ప్రతిరోజు అర్ధగంట నిరసన చేద్దామని పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో ఉద్యోగులంతా తమ కార్యాలయాల్లో మరో గంటసేపు ఎక్కువ పనిచేయాలని చంద్రబాబు చెప్పారు. అవసరమైతే నల్లబ్యాడ్జీలు పెట్టుకుందామని చెప్పారు. నిరసనల్లో భాగంగా నిరాహార దీక్షలు కూడా చేద్దామని అన్నారు. కాగా, మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు సహా ఎవరు ఆందోళన చేపట్టినా సహకరిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.  
Chandrababu
agitation
Special Category Status

More Telugu News