nithin: నితిన్ మూవీలో పొగరుగల అత్తగా సీనియర్ హీరోయిన్!

  • నితిన్ హీరోగా 'ఛల్ మోహన్ రంగ'
  • కథానాయికగా మేఘా ఆకాశ్ 
  • ఆమె తల్లి పాత్రలో లిజి

త్రివిక్రమ్ తోను .. పవన్ కల్యాణ్ తోను నితిన్ కి మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన నితిన్ సినిమా నిర్మాణంలో వాళ్లిద్దరూ భాగస్వాములయ్యారు. ఈ సినిమాకి కథను త్రివిక్రమ్ అందించగా .. కృష్ణ చైతన్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకి 'ఛల్ మోహన్ రంగ' అనే టైటిల్ ను ఫిక్స్ చేసి .. పోస్టర్స్ ను వదులుతున్నారు. ఇక రీసెంట్ గా వదిలిన సింగిల్స్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.

కథ ప్రకారం ఈ సినిమాలో కథానాయిక మేఘా ఆకాశ్ పొగరుగా ప్రవర్తిస్తూ వుంటుందట. ఇక ఆమె తల్లి పాత్ర ( నితిన్ కి అత్త) కూడా పొగరుగా వ్యవహరిస్తూ ఉంటుందని అంటున్నారు. సీనియర్ హీరోయిన్ 'లిజి' ఈ పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. గతంలో ఆమె 'మగాడు'.. '20వ శతాబ్దం' .. 'ఆత్మబంధం' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 'ఛల్' మోహన్ రంగ'ను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.           

More Telugu News