Pawan Kalyan: మిస్టర్ పవన్ కల్యాణ్.. ఎవరి మెప్పు కోసం ఈ విధంగా మాట్లాడుతున్నావ్? : వర్ల రామయ్య

  • శేఖర్ రెడ్డి అవినీతిలో లోకేశ్ కు భాగం ఉందా? 
  • మోదీ మీ చెవిలో చెప్పారా?
  • అవినీతికి పాల్పడాల్సిన ఖర్మ లోకేశ్ కు లేదు
  • విలేకరుల సమావేశంలో టీడీపీ నేత వర్ల రామయ్య
మొన్నటి వరకు తమతో చక్కగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘మిస్టర్ పవన్ కల్యాణ్.. ఎవరి మెప్పు కోసం ఈవిధంగా మాట్లాడుతున్నావ్? ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. శేఖర్ రెడ్డి అవినీతిలో నారా లోకేశ్ కు భాగం ఉందని మోదీ గారు మీ చెవిలో చెప్పారా పవన్ కల్యాణ్ ? ఏపీకి వెళ్లి నువ్వు తగులుకోమని మోదీ గారేమన్నా మీకు చెప్పారా పవన్ కల్యాణ్? ఏంటీ తమాషా? నిలకడలేని మనస్తత్వం నీది. ఈ విషయం సినీ ప్రపంచానికి, రాజకీయ నాయకులకు, నీ అభిమానులకు, ప్రజలందరికీ తెలుసు.

 ఎవరో అనుకుంటుంటే విని నారా లోకేశ్ పై అభాండాలు వేస్తావా? అవినీతికి పాల్పడాల్సిన ఖర్మ ఆ కుర్రాడు ( లోకేశ్)కి ఏమి పట్టింది? నీ గురించి నేను కూడా చాలా విన్నాను చెప్పనా? ఆధారాలు లేకుండా నేను చెప్పను. నీలాగా మాట్లాడను. ఏవైనా ఆరోపణలు చెయ్యాలంటే ఒక ఎవిడెన్స్ కావాలి తమ్ముడూ( పవన్ కల్యాణ్)! తప్పు నాయనా! అలా మాట్లాడకూడదు. పైకి రావాల్సిన వాడివి. చాలా ఆశలున్నాయి నీకు. చాలా ఊహించుకుంటున్నావు నువ్వు. నీ కలలు నెరవేరాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అన్న మెగాస్టార్ ఏమయ్యాడు బాబు (పవన్ కల్యాణ్)! ’ అని వర్ల రామయ్య హితవు పలికారు.
Pawan Kalyan
varla ramaiah

More Telugu News