Pawan Kalyan: పవన్ కల్యాణ్ రోజుకో రకంగా మాట్లాడుతున్నారు : మంత్రి నారాయణ
- ప్రజల్లో పవన్ కల్యాణ్ విశ్వాసం కోల్పోయారు
- నారా లోకేశ్ పై నిరాధార ఆరోపణలు చేశారు
- ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు మోదీ ప్రకటించిన విషయం పవన్ కు తెలియదా? : నారాయణ
టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై ఆరోపణలు గుప్పించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి నారాయణ మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో పవన్ కల్యాణ్ విశ్వాసం కోల్పోయారని అన్నారు. నారా లోకేశ్ పై నిరాధార ఆరోపణలు చేసిన పవన్, లోకేశ్ గురించి తనకు ఎవరో చెప్పారని, తనకు కల వచ్చిందని అంటున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడుతుంటే పవన్ కల్యాణ్ విజయవాడలో కూర్చున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు మోదీ తిరుపతిలో ప్రకటించిన విషయం పవన్ కు తెలియదా? ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని మోదీ చెప్పలేదా? ఈ విషయాలన్నీ పవన్ కల్యాణ్ కు తెలియవా? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీని చంద్రబాబు గట్టెక్కిస్తున్నారని నారాయణ అన్నారు.