చేతులెత్తి దండం పెట్టినా టీఆర్ఎస్ ఎంపీలు వినలేదు: వైవీ సుబ్బారెడ్డి
- కాసేపు సహకరించాలని చేతులు జోడించి అడిగాం
- వాళ్ల సమస్యలపై వారు పోరాడుతున్నామని చెప్పారు
- రేపైనా సభ సజావుగా జరుగుతుందని ఆశిద్దాం
కావేరీ వివాదం 70 ఏళ్లుగా ఉందని... దానిపై తాము పోరాడుతున్నామని అన్నాడీఎంకే ఎంపీలు చెబుతున్నారని చెప్పారు. వారి సమస్యలపై వారు పోరాటం చేయడంలో తప్పు లేదని... వారి సమస్యలను వారు పోరాటం చేస్తుంటే మనం ఆపలేమని అన్నారు. కనీసం రేపైనా సభ సజావుగా సాగుతుందని ఆశిద్దామని చెప్పారు.