bitcoin: బిట్ కాయిన్ల రూపంలో రూ.41 లక్షల మోసం... లబోదిబో మంటున్న ఢిల్లీ మహిళ

  • రూ.6.5 లక్షల విలువైన బిట్ కాయిన్ల చోరీ
  • వాటిని తిరిగి పొందడానికి రూ.35 లక్షల వసూలు
  • మోసపోయిన ఢిల్లీ మహిళ

డిజిటల్ రూపంలో ఉండే క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్, ఈథర్, రిపిల్ తరహా వాటిలో ఇన్వెస్ట్ చేసే వారికి కనువిప్పు కలిగించే ఘటన ఒకటి తాజాగా ఢిల్లీలో వెలుగు చూసింది. క్రిప్టోకరెన్సీలు అన్నీ చట్టవిరుద్ధమైనవనే విషయం తెలిసిందే. ఇవి డిజిటల్ రూపంలో ఉంటాయి. కొనుగోలు తర్వాత వాటిని వ్యాలెట్ లో జమ చేస్తారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళ (50) బిట్ కాయిన్ రాబడులకు ఆకర్షితమై రూ.41 లక్షల మేర మోసపోయింది. బిట్ కాయిన్లను తన వ్యాలెట్ లో ఉంచుకోగా, వాటిని హ్యాకర్లు కొట్టేశారు.

మయూర్ విహార్ ప్రాంతంలో నివసించే సదరు మహిళ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ఆమె వ్యాలెట్ నుంచి 6.5 లక్షల విలువైన బిట్ కాయిన్లను కొట్టేశారు. తర్వాత వాటిని తిరిగి పొందేందుకు సాయం చేస్తామంటూ ఓ వ్యక్తి సంప్రదించి రూ.35 లక్షలు వసూలు చేసి మోసం చేసినట్టు సైబర్ సెల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తెలిపారు.

More Telugu News