తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉందంటే .. రాశి ఖన్నా సమాధానం!
Tue, Mar 20, 2018, 12:52 PM

- ఒక్కో మెట్టూ ఎక్కుతోన్న రాశి ఖన్నా
- హిందీలో రణ్ బీర్ కపూర్ తో నటించాలని వుంది
- తెలుగులో అందరి హీరోలతో చేయాలని వుంది
హిందీలోను .. తెలుగులోను ఏ హీరోలతో నటించాలని ఉందనే ప్రశ్నకి ఆమె స్పందిస్తూ .. "హిందీలో రణ్ బీర్ కపూర్ తో కలిసి నటించాలని వుంది. ఇక తెలుగు విషయానికొస్తే, పవన్ .. మహేశ్ బాబు .. చరణ్ .. బన్నీ .. ఇలా అందరి హీరోలతో కలిసి నటించాలని వుంది" అంటూ చెప్పింది. దాంతో 'తెలివి తేటలు బాగానే నేర్చావ్' అన్నట్టుగా ఆలీ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ నవ్వుల పువ్వులు పూయించింది.