Summer: ఇకపై మరింతగా పెరగనున్న ఉష్ణోగ్రతలు!

  • నిర్మలంగా ఉంటున్న ఆకాశం
  • నేరుగా భూమిని తాకుతున్న సూర్యకిరణాలు
  • సాధారణం కంటే మూడు డిగ్రీల వేడిమి

కోస్తా, రాయలసీమలతో పాటు తెలంగాణలో ఇక ఎండవేడిమి మరింతగా పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. యాంటీ సైక్లోన్ కారణంగా సముద్రం నుంచి తేమ గాలులు వీస్తున్నా మేఘాలు ఏర్పడటం లేదని, దీంతో ఆకాశం నిర్మలంగా ఉండి సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయని అధికారులు తెలిపారు.

పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని, పొడి వాతావరణం, ఉక్కపోత తప్పదని తెలిపారు. కాగా, సోమవారం నాడు రాజమండ్రిలో 39 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, చిత్తూరు, రామగుండం, కరీంనగర్ ప్రాంతాల్లో 38.5, కర్నూలులో 38.2, గుంటూరు, వరంగల్ లో 36.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

More Telugu News