నార్త్ కొరియాకు క్యాబ్ బుక్ చేసిన బెంగళూరు వాసి.. సరేనన్న ఓలా!
- ఉత్తర కొరియాకు రూ.1,49,088 చార్జీగా పేర్కొన్న ఓలా
- షెడ్యూల్, డ్రైవర్ వివరాలను ప్రయాణికుడికి పంపిన సంస్థ
- ట్విట్టర్‌లో పెట్టడంతో వైరల్..
- తప్పు జరిగిపోయిందన్న ఓలా
రోహిత్ వెంటనే దీనిని స్క్రీన్‌షాట్ తీసి ‘ఓలా పనితీరు ఇలా ఉంది.. మీ క్యాబ్‌లో నార్త్ కొరియా వెళ్లడం సాధ్యమేనా? ఒకసారి చెక్ చేసుకోండి’ అని పేర్కొంటూ ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఓలా నిర్వాకంపై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతుండడంతో స్పందించిన ఓలా.. సాంకేతిక తప్పిదంతో ఇలా జరిగిందని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నట్టు పేర్కొంది.