ఏక్, దో, తీన్, అంటూ వచ్చేసిన మోహినీ... వైరల్ వీడియో
- 2016లో వచ్చిన ‘బాఘి’ సినిమాకు ఇది సీక్వెల్ గా ‘బాఘి 2’
- మార్చి 30న విడుదల కానున్న ‘బాఘి 2’
- ‘తేజాబ్’ సినిమాలో మాధురీ దీక్షిత్ ‘ఏక్ దో తీన్..’ రీమిక్స్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్
స్వతహాగా కొరియోగ్రాఫరైన అహ్మద్ ఖాన్ పాత పాటతో ఈ పాటను పోల్చకుండా వుండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒకే ఒక్క స్టెప్పు మినహా మిగిలినవన్నీ కొత్త స్టెప్పులను కంపోజ్ చేయడం విశేషం. ఈ పాటను సోషల్ మీడియాలో విడుదల చేయగా, వైరల్ అవుతోంది. దీనిపై జాక్వెలిన్ మాట్లాడుతూ, ‘మాధురి డ్యాన్స్ చేసినంత గొప్పగా ఎవ్వరూ చేయలేరని చెప్పింది. ఈ పాటకు తనను ఎంచుకున్నప్పుడు ‘చేయగలనా’ అని భయపడ్డానని, అయితే స్టెప్పుల విషయంలో పోలిక ఉండదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నానని తెలిపింది. కాగా, మాధురి పాట ఏడు నిమిషాల నిడివి ఉండగా, జాక్వెలిన్ పాట రెండు నిమిషాల నిడివి కూడా లేకపోవడం విశేషం.