Ugadi: కొత్త సంవత్సరంలో కష్టాలు అధికం: స్వరూపానందేంద్ర స్వామి

షార్ట్స్‌లో చూడండి
విళంబి నామ సంవత్సరం అధిక కష్టాలను అందించనుందని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ సంవత్సరం కుజుడు, శని కలుస్తున్నారని, ధనస్సు రాశిలో జరిగే ఈ కలయిక ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో మకర రాశిలో కుజ స్తంభన జరుగుతోందని, కేతువును కుజుడు కలవనున్నాడని, ఈ పరిణామాలను చూస్తుంటే, ఈ సంవత్సరం అధికమైన కష్టాలు తప్పవని ఆయన అన్నారు.

రాజకీయ మార్పులు ఇంకా ఎన్నో జరగనున్నాయని, వర్షపాతం అతివృష్టి, అనావృష్టిలను తీసుకురానుందని, రైతులకు కూడా ఇబ్బంది తప్పదని, ఎండలు విపరీతంగా ఉంటాయని, సామాన్యులు వడదెబ్బలతో ఇబ్బందులు పడతారని వ్యాఖ్యానించారు. ప్రజలు వాళ్ల వాళ్ల పుట్టుక, గ్రహస్థితులను బట్టి కొందరికి బాగుంటుందని, అయితే, ఎక్కువ మంది కష్టపడతారని అభిప్రాయపడ్డారు. రాజకీయ అనిశ్చిత స్థితి రానుందని స్వరూపానందేంద్ర వెల్లడించారు. 
Go Back to Shorts
Ugadi
Vilambi
Swaroopanandendra

More Telugu News