Venkaiah Naidu: రాజ్‌భవన్‌లో శ్రీవిళంబినామ సంవ‌త్స‌ర‌ ఉగాది వేడుకలు.. హాజ‌రైన వెంక‌య్య‌, న‌ర‌సింహ‌న్, కేసీఆర్

  • వేడుకలను ప్రారంభించిన గవర్నర్ నరసింహన్ దంపతులు
  • మ‌న జీవితం, పండుగ‌లు అంతా ప్ర‌కృతితో ముడిప‌డి ఉన్నాయి: వెంకయ్య
  • అలాంటి ప్ర‌కృతిని మ‌నం నిర్ల‌క్ష్యం చేస్తున్నాం

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు పేర్కొన్నారు. హైదరాబాదు, రాజ్‌భవన్‌లో శ్రీవిళంబినామ సంవ‌త్స‌ర‌ ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రారంభించారు. ఈ వేడుకలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌భుత్వాధికారులు హాజ‌ర‌య్యారు.  ఈ సంద‌ర్భంగా వెంక‌య్య నాయుడు ప్ర‌సంగిస్తూ.. మ‌న జీవితం, పండుగ‌లు అంతా ప్ర‌కృతితో ముడిప‌డి ఉన్నాయ‌ని అన్నారు. అలాంటి ప్ర‌కృతిని మ‌నం నిర్ల‌క్ష్యం చేస్తూ ప్ర‌మాదం కొనితెచ్చుకుంటున్నామ‌న్నారు. ప్ర‌స్తుత త‌రానికి తెలుగు నెల‌లు, సంవ‌త్స‌రాలు తెలియ‌డంలేద‌న్నారు. మ‌నం జ‌రుపుకునే ప్ర‌తి పండుగ వెనుక శాస్త్రీయ‌మైన సందేశం ఉంద‌ని, ఉగాది ప‌చ్చ‌డిలాగే జీవితంలోనూ ష‌డ్రుచులుంటాయ‌ని అన్నారు. మ‌న భాష‌, సంస్కృతి గురించి పిల్ల‌లు చెప్పాల‌ని పిలుపునిచ్చారు.  
         

More Telugu News