anant kumar: అవిశ్వాసం పెడితే ఎదుర్కొనేందుకు సిద్ధం.. పూర్తి మద్దతు ఉంది: కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌

  • పార్లమెంటు బయట, లోపల ఎన్డీయే సర్కారుకి పూర్తి మద్దతు
  • టీడీపీ కొన్ని విషయాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది
  • ఏపీ రూపకల్పన కోసం కేంద్రం అదనంగా రూ.24వేల కోట్లు విడుదల చేసింది
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెడుతోన్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంటు బయట, లోపల ఎన్డీయే సర్కారుకి పూర్తి మద్దతు ఉందని తెలిపారు.

టీడీపీ కొన్ని విషయాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని అవిశ్వాస తీర్మానం పెడదామని నిర్ణయం తీసుకుందని, కేంద్ర సర్కారు ఏపీ కోసం అదనంగా రూ.24వేల కోట్లు విడుదల చేసిందని అనంత్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికీ ఇంత మొత్తంలో నిధులు ఇవ్వలేదని, ఏపీలో రాజధాని నిర్మాణానికి, పోలవరం, జాతీయ రహదారులు ఇతర కార్యక్రమాలకు కేంద్ర సర్కారు నిధులు ఇచ్చి సాయం చేసిందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
anant kumar
Special Category Status
Telugudesam
NDA

More Telugu News