Pawan Kalyan: మోదీని చూస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ భ‌య‌ప‌డుతున్నారు: కొల్లు ర‌వీంద్ర

  • ప్రజాసేవ కోసం లోకేశ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు 
  • ప‌వ‌న్ క‌ల్యాణ్ శైలి ఒక‌రోజు సినిమా సెట్లో మ‌రోరోజు రాజ‌కీయ సెట్లో ఉన్న‌ట్లుగా ఉంది
  • రాష్ట్ర ప్ర‌యోజ‌నాలను మోదీకి తాక‌ట్టు పెడుతున్న ప‌వ‌న్ కు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ... ప్రజాసేవ కోసం నారా లోకేశ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఆయనపై ఆరోపణలు సరికావని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ శైలి ఒక‌రోజు సినిమా సెట్లో మ‌రోరోజు రాజ‌కీయ సెట్లో ఉన్న‌ట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ భ‌య‌ప‌డుతున్నారని, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలను తాక‌ట్టు పెడుతున్న ప‌వ‌న్ కు ప్ర‌జ‌లే తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. 
Pawan Kalyan
Andhra Pradesh
Kollu Ravindra

More Telugu News