nagachaitanya: సురేశ్ ప్రొడక్షన్స్ లో నాగచైతన్య మూవీ

  • వరుస సినిమాలతో చైతూ 
  • రీసెంట్ గా కథ వినిపించిన బాబీ 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సురేశ్ బాబు  
జయాపజయాల సంగతి అటుంచితే .. సినిమాకి, సినిమాకి మధ్య పెద్దగా గ్యాప్ రాకుండా నాగచైతన్య చూసుకుంటున్నాడు. యువదర్శకులకు అవకాశాలను ఇస్తూ కొత్త కథలతో ముందుకు వెళుతున్నాడు. అన్నపూర్ణ బ్యానర్ పైనే కాదు .. ఇతర బ్యానర్స్ పై కూడా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అయితే మేనమామ సొంత బ్యానర్ అయిన సురేశ్ ప్రొడక్షన్స్ లో ఆయన ఇంతవరకూ సినిమా చేయలేదు.

గతంలో ఒకటి రెండు మార్లు ప్రయత్నాలు జరిగినా, ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు. త్వరలో సురేశ్ ప్రొడక్షన్స్ లో చైతూ ఒక సినిమా చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా దర్శకుడు బాబీ .. చైతూను కలిసి ఒక కథ వినిపించాడట. కథలోని కొత్తదనం సురేశ్ బాబుకి కూడా నచ్చిందని సమాచారం. అందువలన ఈ సినిమా సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 
nagachaitanya
suresh babu

More Telugu News