Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను జనం నమ్మకపోవడానికి కారణం ఇదే: గద్దె రామ్మోహన్

  • ఎవరో చెబితే లోకేష్ ను విమర్శించారు
  • పవన్ యూటర్న్ ను చూసి ఆ పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపోయారు
  • కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను ఏపీ ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నారు. మొన్నటిదాకా టీడీపీ, మంత్రి నారా లోకేష్ పై ఒక్క మాట కూడా అనని పవన్... ఎవరో చెబితే, ఇప్పుడు లోకేష్ పై విమర్శలు చేస్తున్నారని... ఇలాంటి వైఖరి వల్లే ఆయన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. ఊహించని విధంగా ఆయన తీసుకున్న యూటర్న్ ను చూసి జనసేన కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని రామ్మోహన్ అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా... రాష్ట్రాన్ని సమర్థవంతంగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పాలిస్తున్నారని చెప్పారు. విభజన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందని అన్నారు.
Pawan Kalyan
Gadde Rammohan
Chandrababu

More Telugu News