rape attempt: 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష!: చట్టాన్ని ఆమోదించిన హర్యానా అసెంబ్లీ

  • బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం
  • బాలికలను కాపాడుకునేందుకు ఈ చట్టం ఉపకరిస్తుందన్న సీఎం
  • రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోనూ ఈ తరహా చట్టం

బాలికలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో హర్యానా ఈ విషయమై గట్టి నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లు, ఆలోపు వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే, నిందితులను ఉరితీసే బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. చిన్నారి బాలికలను కాపాడుకునేందుకు ఈ చట్టం ఓ మైలురాయి అవుతుందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు.

బాలికలపై అత్యాచారం చేసినవారికి మరణ దండనే సరైనదంటూ, ఇందుకు సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర  ప్రభుత్వం లోగడే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఐపీసీలోని పలు సెక్షన్లను సవరించాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరిలో బాలికలపై అత్యాచార ఘటనలు వరుసగా ఐదు వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అడుగులు వేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇదే తరహా చట్టాన్ని గతేడాది ఆమోదించిన విషయం విదితమే.  

More Telugu News