అవిశ్వాసంపై నోటీసులు అందాయి... కానీ ఈ పరిస్థితుల్లో నేనేం చేసేది?: సభ్యులకు సుమిత్రా మహాజన్ సూటి ప్రశ్న
- వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహం నోటీసులు ఇచ్చారు
- సభ ఆర్డర్ లో లేకుంటే అవిశ్వాసంపై చర్చెలా?
- వాయిదా వేయక తప్పడం లేదన్న సుమిత్రా మహాజన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ సభ్యుడు తోట నర్సిహం నోటీసులు ఇచ్చారని, వాటిని తాను స్వీకరించానని చెప్పిన సుమిత్రా మహాజన్, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సోమవారానికి సభను వాయిదా వేయాల్సి ఉంటుందన్నారు. సభ సజావుగా ఉంటేనే అవిశ్వాస తీర్మానాలను పరిగణనలోకి తీసుకుంటానని హెచ్చరించిన ఆమె, సభ్యులు ఎంతకూ సర్దుకోకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.