YV Subba Reddy: అవిశ్వాసంపై నోటీసులు అందాయి... కానీ ఈ పరిస్థితుల్లో నేనేం చేసేది?: సభ్యులకు సుమిత్రా మహాజన్ సూటి ప్రశ్న

  • వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహం నోటీసులు ఇచ్చారు
  • సభ ఆర్డర్ లో లేకుంటే అవిశ్వాసంపై చర్చెలా?
  • వాయిదా వేయక తప్పడం లేదన్న సుమిత్రా మహాజన్

కేంద్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందంటూ వచ్చిన అవిశ్వాస తీర్మానాలు తనకు అందాయని, వాటిపై చర్చించాలని తనకు ఉన్నప్పటికీ, సభ ఆర్డర్ లో లేదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. సభలో చర్చకు సానుకూల పరిస్థితి ఉన్నట్టు తనకు కనిపించడం లేదని, అందువల్లే అవిశ్వాసంపై చర్చ చేపట్టలేకపోతున్నానని అన్నారు. అన్ని పార్టీల సభ్యులూ ఇలా పోడియంలో నిరసనలు తెలుపుతూ నినాదాలు చేస్తున్న పరిస్థితుల్లో తాను మాత్రం ఏం చేయగలనని ప్రశ్నించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ సభ్యుడు తోట నర్సిహం నోటీసులు ఇచ్చారని, వాటిని తాను స్వీకరించానని చెప్పిన సుమిత్రా మహాజన్, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సోమవారానికి సభను వాయిదా వేయాల్సి ఉంటుందన్నారు. సభ సజావుగా ఉంటేనే అవిశ్వాస తీర్మానాలను పరిగణనలోకి తీసుకుంటానని హెచ్చరించిన ఆమె, సభ్యులు ఎంతకూ సర్దుకోకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News