france: ఫ్రాన్స్ లో పాపకు పేరు పేచీ... కోర్టుకెక్కిన ప్రభుత్వం!

  • పాపకు ఇష్టమైన పేరు పెట్టుకున్న దంపతులు
  • రిజిస్ట్రేషన్ సమయంలో వ్యతిరేకించిన ప్రభుత్వం
  • న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దంపతులు

సాధారణంగా తమ పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారు. కొందరు తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లు పెట్టుకుంటే, మరికొందరు తమకు ఇష్టమైన ప్రదేశాలు, వస్తువులు వంటి వాటి పేర్లను పెట్టుకుంటుంటారు. ఫ్రాన్స్ లో మాత్రం ఓ పాప విషయంలో అలా కుదరలేదు.

ఆ వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్ లో ఓ దంపతులకు పాప పుట్టింది. ఆ పాపకు వారు పేరు పెట్టారు. దానిని రిజిస్టర్ చేయించేందుకు వెళ్లగా నిబంధనలు అంగీకరించవని, పేరు మార్చాలని అధికారులు సూచించారు. ఇష్టంతో పెట్టుకున్న పేరును మార్చమని చెప్పడం ఇష్టం లేని ఆ దంపతులు కోర్టుని ఆశ్రయించారు. దీంతో ‘ఎప్పటినుంచో ఈ పేరు అబ్బాయిలకు మాత్రమే పెడుతున్నారు. ఇలా పేర్లు మార్చడం వల్ల వారు ఆడా, మగా అనే తేడా గుర్తించడం కష్టం అవుతుంది. అంతేకాకుండా ఆ చిన్నారి సామాజికంగా కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంది’ అని న్యాయస్థానంలో ప్రభుత్వం వాదించింది.

అంతే కాకుండా, చిన్నారికి రానున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆమెకు అబ్బాయి పేరు పెట్టడాన్ని నిషేధించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఒకవేళ వారికి సరైన పేరు దొరకకపోతే కోర్టే ఆ చిన్నారికి తగిన పేరు పెట్టాలని సూచించింది. కాగా, గతంలో కూడా ఒక జంట తమ బాబుకి 'జీహాద్' అని నామకరణం చేయగా, దానిని ప్రభుత్వం అడ్డుకుంది. అరబిక్ లో 'జీహాద్' కి 'పవిత్ర యుద్ధం' అన్న అర్థంతో పాటు, 'ప్రయత్నం' (ఎఫర్ట్), 'పోరాటం' (స్ట్రగుల్) అన్న అర్థాలు కూడా వస్తాయని వారెంత చెప్పినా పట్టించుకోలేదు. అలాగే న్యూటెల్లా, ఫ్రెయిజ్‌, మ్యాన్‌ హట్టన్‌ వంటి పేర్లు పెట్టాలని భావించిన వారికి కూడా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదురైంది.

More Telugu News