jayasudha: శోభన్ బాబు చాలా హ్యాండ్సమ్ .. ఆయన అలా ఆటపట్టించేవారు: జయసుధ

  • కృష్ణగారు చాలా తక్కువ మాట్లాడతారు
  • శోభన్ బాబుగారు సరదాగా ఉంటారు 
  • ఆయనతో అందరూ చనువుగా ఉండేవారు
ఎన్టీఆర్ ..ఏఎన్నార్ లతో మాత్రమే కాదు, కృష్ణ .. శోభన్ బాబులతోను జయసుధ చెప్పుకోదగిన సినిమాలు చేశారు. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ కృష్ణ .. శోభన్ బాబుల గురించి ప్రస్తావించారు. " కృష్ణగారు చాలా హాండ్సమ్ .. ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు. ఇక శోభన్ బాబు గారు కూడా చాలా హాండ్సమ్ .. ఆయన అందరితోనూ చాలా సరదాగా మాట్లాడేవారు"

"శోభన్ బాబు గారితో కలిసి పనిచేసే హీరోయిన్స్ .. తమ పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునే వారు . బాయ్ ఫ్రెండ్స్ కి సంబంధించిన విషయాలను గురించి కూడా ఆయనకి చెప్పుకునే వారు. ఒకసారి ఆయన నా దగ్గరికి వచ్చి ' అందరూ నా దగ్గరికి వచ్చి తమ బాయ్ ఫ్రెండ్స్ గురించి చెబుతున్నారు .. నేను కదా మీ హీరోను .. నేను ఎంత ఫీలవుతానో ఆలోచించారా?' అంటూ సరదాగా నవ్వేశారు. అంతలా ఆయన అందరితోనూ కలివిడిగా ఉండేవారు" అని చెప్పుకొచ్చారు.   
jayasudha
sobhan babu

More Telugu News