Narendra Modi: మోదీజీ..ఎవరో పవన్ కల్యాణ్ ని తీసుకొచ్చి మమ్మల్ని పొమ్మనలేక పొగబెడతావా? : ఎంపీ శివప్రసాద్

  • లోకేశ్ బాబు మీద అపనిందలు వేస్తారా?
  • హోదా కోసం పోరాడుతుంటే మమ్మల్ని తిట్టిస్తారా?
  • ఇలా చేస్తే..అల్లా, మీకు న్యాయం చేయడు
  • మాట ఇచ్చి తప్పుకోవడం చాలా నీచమైన పని : శివప్రసాద్
టీడీపీపై ఆరోపణలు గుప్పించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగుదేశం పార్టీ నేతల మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా, టీడీపీ ఎంపీ శివప్రసాద్ తన దైన శైలిలో ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ ప్రాంగణంలో రోజుకో వేష ధారణలో శివప్రసాద్ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ముస్లిం వేషధారణలో ఉన్న శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ‘మోదీజీ..ఎవరో పవన్ కల్యాణ్ ని తీసుకొచ్చి మమ్మల్ని పొమ్మనలేక పొగబెడతావా? మాపై నిందలు వేస్తావా? చిన్న పిల్లవాడు..ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం, బాగు కోసం, ఐటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న లోకేశ్ బాబు మీద అపనిందలు వేస్తారా? మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే.. మీరు చేసే పని ఇదా? హోదా కోసం పోరాడుతుంటే మమ్మల్ని తిట్టిస్తారా? ఇలా చేస్తే..అల్లా, మీకు న్యాయం చేయడు. మాట ఇచ్చి తప్పుకోవడం చాలా నీచమైన పని. పవన్ వెనుక మోదీ ఉన్నారు’ అంటూ శివప్రసాద్ మండిపడ్డారు. 
Narendra Modi
Telugudesam
mp sivaprasad

More Telugu News