Pawan Kalyan: విజయవాడలో పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం!

  • పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న టీడీపీ కార్యకర్తలు
  • దిష్టిబొమ్మ దహనానికి యత్నం .. అడ్డుకున్న పోలీసులు
  • పవన్ చదివిన స్క్రిప్ట్ ఉండవల్లి రాసిచ్చిందేనంటూ మండిపాటు
టీడీపీపై, ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పవన్ కల్యాణ్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. వెంటనే, అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకుని, చెదరగొట్టారు. ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ పై టీడీపీ కార్యకర్తలు విమర్శలు గుప్పించారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చదివిన స్క్రిప్ట్ ఉండవల్లి రాసిచ్చిందేనని ఆరోపించారు.ఈ వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan

More Telugu News