Pawan Kalyan: ఆగస్టు 14న మా పార్టీ మేనిఫెస్టో ప్రకటన... ఇక తెలుగుదేశం పార్టీపై పోరాటం: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • ఇక‌పై టీడీపీతో స్నేహం చేయను
  • ఆ పార్టీపై ఎదురు తిరుగుతా 
  • ఏపీలో కాపులకు, బీసీలకు గొడవలు పెట్టారు
  • 93940 22222కు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి జనసేన సభ్యత్వం పొందండి
తాను ఇక‌పై టీడీపీతో స్నేహం చేయనని, ఆ పార్టీపై ఎదురు తిరుగుతానని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. ఈ రోజు గుంటూరులో నిర్వ‌హించిన మ‌హాస‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ నేత‌ల వ‌ల్ల అధికారులు కూడా త‌ప్పులు చేస్తున్నార‌ని అన్నారు. తాము నైతికంగా తప్పు చేస్తున్నామని కొందరు ప్రభుత్వ అధికారులు త‌నతో చెప్పారని అన్నారు. టీడీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో రైతులకు కనీస మద్దతు ధ‌ర‌ అందట్లేదని తెలిపారు. అలాగే భూ కబ్జా సంస్కృతిని విశాఖపట్నానికి కూడా తీసుకొచ్చారని ఆరోపించారు. ప్ర‌భుత్వ ఉద్యోగి వ‌న‌జాక్షిపై ఓ ఎమ్మెల్యే దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తే ఆయ‌నకు టీడీపీ ప్ర‌భుత్వం ఏ శిక్షా విధించ‌లేద‌ని అన్నారు. ఆ ఎమ్మెల్యేకి కొమ్ములున్నాయా? అని ప్ర‌శ్నించారు.

అలాగే ఏపీలో కాపులకు, బీసీలకు గొడవలు పెట్టారని, మరోవైపు మత్స్యకారులకు, గిరిజనులకు గొడవలు రాజేశారని పవన్ ఆరోపించారు. తాము ఇక‌ టీడీపీపై పోరాటానికి తాము సిద్ధం అవుతున్నామ‌ని అన్నారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ కోసం పోరాడతామ‌ని చెప్పారు. అలాగే, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడదామని, తెలుగు వాడి తెగింపు, ఆంధ్రుడి ఆత్మ గౌరవం ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వానికి రుచిచూపిద్దామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు అవసరమైతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 14న జనసేన మేనిఫెస్టో ప్రకటిస్తామ‌ని తెలిపారు. తమ పార్టీ ఏ ఒక్క కులాన్ని కూడా మభ్యపెట్టబోదని చెప్పారు. తాము కుల నిర్మూలన చేయలేమేమో కానీ కులాల మధ్య ఐక్యత మాత్రం సాధిస్తామని అన్నారు. మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేయాలని అన్నారు. ప్రజలు 93940 22222కు ఒక మిస్డ్ కాల్ ఇస్తే జనసేన సభ్యత్వం పొందవచ్చని అన్నారు. 
Pawan Kalyan
Chandrababu
Andhra Pradesh
Special Category Status

More Telugu News