women: రోడ్డుపై మహిళను ఢీ కొన్న ఎద్దు.. పది అడుగుల ఎత్తుకి ఎగిరి కిందపడ్డ వైనం

  • గుజ‌రాత్‌లోని భరూచ్ జిల్లాలో ఘటన
  • సీసీ కెమెరాలో రికార్డు
  • మహిళ తలకు తీవ్రగాయాలు
రోడ్డుపై నడుకుంటూ వెళుతోన్న మహిళపై ఓ ఎద్దు కొమ్ములతో దాడి చేయగా, ఆమె అమాంతం పది అడుగుల ఎత్తుకి ఎగిరి కిందపడ్డ ఘటన గుజ‌రాత్‌లోని భరూచ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సదరు మహిళ పసుపు రంగు చీర ధరించి రోడ్డు పక్క నుంచి నడుకుంటూ వెళుతోంది. ఇంతలో ఓ ఎద్దు వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా కొమ్ములతో మహిళను ఢీ కొట్టింది. దీంతో ఆమె గాల్లో పల్టీలు కొడుతూ పడిపోయి గాయాలపాలైంది.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె తలకి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఎద్దు యజమాని ఎవరన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఎద్దుని ఇలా నిర్లక్ష్యంగా రోడ్డుపై వదిలేసినందుకు గానూ ఆ యజమానిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.  
women
bull
Gujarath

More Telugu News