Pawan Kalyan: సమస్యలపై పోరాటం చేయడం అంటే నాకు ఇష్టం: మహాసభలో పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
సమస్యలపై పోరాటం చేయడం అంటే తనకు ఇష్టమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా జనసేన నిర్వహించతలపెట్టిన పార్టీ ఆవిర్భావ మహాసభ ప్రాంగణానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేరుకుని వేదికపై ప్రసంగిస్తున్నారు. భారత్ మాతాకీ జై అంటూ పవన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సమకాలీన రాజకీయ వ్యవస్థ ప్రజలను వంచించినందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. ప్రజల మనిషిగా ప్రజల ముందుకు వచ్చి తాను పార్టీ పెట్టానని అన్నారు.  కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రుల ఆవేదనను తెలియచేద్దామని అన్నారు.

మరోవైపు పెద్ద ఎత్తున జనసేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు అక్కడకు వ‌చ్చారు. కాగా, జనసేన యువజన విభాగానికి నేతాజీ యువసేనగా, మహిళా విభాగానికి ఝాన్సీ లక్ష్మి వీర మహిళా సేనగా, విద్యార్థి విభాగానికి భగత్ సింగ్ విద్యార్థి విభాగంగా పేర్లు పెడుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Guntur District

More Telugu News