కృష్ణగారికి కోపం వచ్చిందనుకుని ఏడ్చేశాను: ఇంద్రజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణగారికి కోపం వచ్చిందనుకుని ఏడ్చేశాను: ఇంద్రజ

  • కృష్ణగారితో 'అమ్మదొంగా' చేశాను 
  • ఆయన మాట్లాడేవారు కాదు 
  • నా మీద కోపం అనుకున్నాను
ఇంద్రజకి మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలలో 'అమ్మదొంగా' ఒకటి. ఈ సినిమాలో ఆమె సూపర్ స్టార్ కృష్ణ సరసన నటించారు. ఆ సినిమాకి సంబంధించిన ఒక సంఘటనను గురించి ఆమె 'ఆలీతో సరదాగా' వేదికపై పంచుకున్నారు. ఈ సినిమా కోసం కబురు చేస్తే సెట్ కి వెళ్లాను. దర్శకులు సాగర్ గారు నన్ను చూసి .. ఈ అమ్మాయి మరీ చిన్నపిల్లలా వుంది అని చెప్పేసి పంపించేశారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ .. ఉన్నావని చెప్పారు.

"కృష్ణగారు అస్సలు మాట్లాడేవారు కాదు. నేను సరిగ్గా యాక్ట్ చేయడం లేదా? .. నామీద ఏమైనా కోపమా? ఆయన టైమింగ్ ను అందుకోలేకపోతున్నానా? అనే విషయం అర్థంకాక ఫస్టు డే సెట్లో ఏడ్చేశాను. ఆయన మేకప్ మేన్ .. హెయిర్ డ్రెస్సర్ అంతా వచ్చి, ఆయనంతేనమ్మా అందరితో అలాగే వుంటారు .. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు అని చెప్పారు. ఆ తరువాత కృష్ణగారు ఎంత సింపుల్ గా వుంటారనేది అర్థమై ఆశ్చర్యమేసింది" అంటూ చెప్పుకొచ్చారు.   
krishna
indraja

More Telugu News