Pawan Kalyan: ప్రజా సమస్యలు పవన్ కల్యాణ్‌ను కదిలించాయి: పరుచూరి గోపాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా కాసేపట్లో జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ ప్రారంభం కానుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సభలో ప్రసంగించి, తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేస్తూ... 'ఎంతో గొప్ప నటజీవితం! కానీ ప్రజా సమస్యలు ఆయనను కదిలించాయి! జనం కోసం తాను ముందు సైనికుడై జనసేనను స్థాపించాడు. జనసేన ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు పవన్ కల్యాణ్ గారూ.. విజయీభవ' అని పేర్కొన్నారు. కాగా, 35 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతోన్న జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ ప్రాంగణానికి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు చేరుకుంటున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
paruchuri
Jana Sena
Twitter

More Telugu News