stormy daniels: ట్రంప్ తో శృంగార తార స్టామీ డేనియెల్స్ కు శారీరక సంబంధం ఉంది: ఫోటోగ్రాఫర్

  • 2006లో తొలిసారి స్టామీ డానియెల్ కు ఫోన్ చేసిన ట్రంప్
  • ఏడు సార్లు ఫోన్ లో ట్రంప్ ఏం మాట్లాడుతారో విన్నాను
  • స్టామీ డానియెల్ తో ట్రంప్ కి శారీరక సంబంధం ఉంది

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తో శృంగార తార స్టామీ డానియెల్‌ కు శారీరక సంబంధం ఉందని శృంగార తారల ఫోటోగ్రాఫర్ కెయిత్‌ మున్యాన్‌ తెలిపారు. ట్రంప్ తో స్టామీ సంబంధం విషయాన్ని బట్టబయలు చేయకుండా ఉండేందుకు ట్రంప్ చేసుకున్న ఒప్పందానికి సాక్షులుగా సంతకాలు చేసినవారిలో మున్యాన్ కూడా ఒకరు కావడం విశేషం. తనను సంప్రదించిన మీడియాతో మున్యాన్ మాట్లాడుతూ, 2006 నుంచి 2008 వరకు తాను న్యూయార్క్ లోని ఒక లోయ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసించానని తెలిపారు.

 2006 లో ట్రంప్ తొలిసారి స్టామీ డానియెల్‌ కు ఫోన్‌ చేశాడని చెప్పారు. మాట్లాడేదెవరని డానియెల్ అడిగిందని, ట్రంప్ ఫోన్ చేసినప్పుడు తామిద్దరం చెరొక ఇయర్ ఫోన్ ను చెవిలో పెట్టుకుని వినేవారమని తెలిపాడు. ట్రంప్ మాటలు చిత్రంగా ఉండేవని మున్యాన్ తెలిపాడు. ట్రంప్ తో సంబంధం ఇష్టం లేదని డానియెల్ పలుమార్లు స్పష్టం చేసిందని అన్నాడు. కానీ, ట్రంప్‌ మాత్రం ఫోన్‌ చేస్తూనే ఉండేవాడని చెప్పాడు. తాను ఏడుసార్లు డానియెల్ తో కలిసి ట్రంప్ మాటలు విన్నానని చెప్పాడు. అన్నీ పిచ్చిమాటలేనని ఆయన తెలిపాడు.

ఆ తరువాత క్రమంగా వారిద్దరూ దగ్గరయ్యారని అన్నాడు. ట్రంప్ కు డ్రెస్ సెన్స్ కూడా లేదని, వారిద్దరూ పార్టీలకు వెళ్లేప్పుడు డ్రెస్ సరిగా వేసుకోవాలని డానియెల్ సర్దేదని మున్యాన్ తెలిపాడు. ఒప్పందం విషయాలు పూర్తిగా వెల్లడించలేనని చెప్పిన మున్యాన్..వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉందనేది మాత్రం వాస్తవమని స్పష్టం చేశాడు. కాగా, ట్రంప్ తో సంబంధంపై ఇప్పటికే స్టామీ డానియెల్ మూడు సార్లు మాట్లాడగా, ట్రంప్, వైట్ హౌస్ వాటిని ఖండించారు. కాగా, అప్పట్లో ఆమెతో ట్రంప్ చేసుకున్న ఒప్పందంపై డానియెల్ మేనేజర్ గినా రోడ్రిగ్వెజ్‌, డానియెల్‌ మాజీ భర్త మైక్‌ మోస్నీ, మరో శృంగార తార జెస్సికా, ఫోటోగ్రాఫర్, స్టామీ స్నేహితుడు కెయిత్ మున్యాన్ లు సంతకాలు చేశారు. 

More Telugu News