C-17 Globe Master: చైనా సరిహద్దుల్లో అతిపెద్ద రవాణా విమానాన్ని తొలిసారిగా దించిన భారత్

  • టుటింగ్ ఎయిర్ ఫీల్డ్ లో ల్యాండ్ అయిన సీ-17 గ్లోబ్ మాస్టర్
  • పైలెట్ల నైపుణ్యానికి పరీక్షగా నిలిచిందన్న ఉన్నతాధికారి
  • చరిత్రాత్మకమని వ్యాఖ్యానించిన వాయుసేన

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ లో సరిహద్దులకు దగ్గరగా ఉండే టుటింగ్ ఎయిర్ ఫీల్డ్ లో అతిపెద్ద రవాణా విమానం సీ-17 గ్లోబ్ మాస్టర్ ను ఎయిర్ ఫోర్స్ ల్యాండ్ చేసింది. ఈ విమానాన్ని ఇక్కడ దించడం ఇదే తొలిసారి. అమెరికాలో తయారైన ఈ రవాణా విమానంలో సైన్యానికి అవసరమైన ఎటువంటి ఆయుధాలనైనా, వాహనాలనైనా ఎక్కడికి కావాలంటే అక్కడికి చేర్చవచ్చు. టుటింగ్ రన్ వేపై సీ-17 గ్లోబ్ మాస్టర్ ల్యాండ్ కావడం చరిత్రాత్మకమని, పైలెట్ల నైపుణ్యానికి ఈ ఎయిర్ బేస్ పరీక్షగా నిలిచిందని వాయుసేన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, గత సంవత్సరం జూన్ 16 నుంచి దాదాపు 73 రోజుల పాటు డోక్లాం ప్రాంతంలో భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లోని ఆ ప్రాంతం తమదంటే తమదని భారత్, చైనాలు దాదాపు యుద్ధానికి దిగినంత పని చేశాయి. ఆపై ఇరు దేశాల దౌత్యాధికారుల చర్చలతో ఆగస్టు 28 నాటికి రెండు దేశాల సైన్యం వెనక్కు మళ్లాలని నిర్ణయించుకోవడంతో సమస్య సద్దుమణిగింది.

More Telugu News