SBI: ఖాతాల్లో కనీస నగదు లేదని 41.16 లక్షల అకౌంట్లను మూసేసిన ఎస్‌బీఐ

  • కనీస నిల్వలు పాటించని వినియోగదారుల ఖాతాలు మూసివేత
  • ఆర్టీఐ చట్టం ద్వారా వెలుగులోకి
  • స్వయంగా వెల్లడించిన ఎస్‌బీఐ

ఖాతాల్లో కనీస నగదు నిల్వ లేదన్న ఒకే ఒక్క కారణంతో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) ఏకంగా 41.61 లక్షల ఖాతాలను మూసివేసింది. సమాచార హక్కులో భాగంగా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఎస్‌బీఐ ఈ వివరాలను తెలియజేస్తూ ఆయనకు లేఖ రాసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో 41 లక్షలకు పైగా ఖాతాలను మూసివేసినట్టు అందులో పేర్కొంది.

బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ లేకుంటే విధించే జరిమానా చార్జీలను 75 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ మంగళవారం ప్రకటించింది. అదే రోజు 41 లక్షలకు పైగా ఖాతాలను మూసివేసినట్టు వెలుగు చూడడం గమనార్హం. 2017-18 తొలి 8 నెలల్లో సగటు నగదు నిల్వలేని ఖాతాల నుంచి ఎస్‌బీఐ ఏకంగా రూ.1,777.67 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News