swamy goud: స్వామిగౌడ్ కంటి కార్నియా దెబ్బతిందని వైద్యులు చెబుతున్నారు : టీఆర్ఎస్ నేత కేకే

  • స్వామిగౌడ్ ని పరామర్శించిన టీఆర్ఎస్ నేత కేకే
  • ఆయన పై అసెంబ్లీలో దాడి జరగడం బాధాకరం
  • కాంగ్రెస్ పార్టీ నిరసనల స్థాయి హద్దులు దాటింది : కేకే
తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు జరిగిన సంఘటనలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైన విషయం విదితమే. సరోజనీ దేవి కంటి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ ని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు (కేకే) పరామర్శించారు. అనంతరం, మీడియాతో కేకే మాట్లాడుతూ, స్వామిగౌడ్ కంటి కార్నియా దెబ్బతిందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. స్వామిగౌడ్ పై అసెంబ్లీలో దాడి జరగడం బాధాకరం, దురదృష్టకరమని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ నిరసనల స్థాయి హద్దులు దాటిందని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
swamy goud
k.kesavarao
TRS

More Telugu News