Pakistan's Punjab province: అక్కడి స్కూళ్లలో స్టూడెంట్లతో డాన్సులు నిషిద్ధం...!

  • స్కూళ్లలో స్టూడెంట్ల డాన్సులపై పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం నిషేధం
  • అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక
  • నిషేధం సక్రమ అమలు బాధ్యత జిల్లా విద్యాశాఖాధికారులకు
విద్యార్థులతో బలవంతంగా నృత్యాలు చేయించే పాఠశాలల లైసెన్సులు రద్దు చేస్తామంటూ పాకిస్తాన్‌ పరిధిలోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పాఠశాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో నృత్యాలను నిషేధించినట్లు 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' పత్రిక కథనం పేర్కొంది. కథనం ప్రకారం, స్కూళ్లలో డాన్సులు చేయడం మతవిలువలకు, సూత్రాలకు, సిద్ధాంతాలకు విరుద్ధం. విద్యార్థుల చేత బలవంతంగా డాన్సులు చేయించడం లేదా అలాంటి అనైతిక కార్యక్రమాల్లో వారు పాల్గొనేలా చేసే స్కూళ్ల లైసెన్సులు రద్దు చేస్తామంటూ ప్రభుత్వం ఓ నోటీసు జారీ చేసింది. డాన్సులపై విధించిన నిషేధాజ్ఞలను టీచర్లు, విద్యాసంస్థల అధిపతులు సహా పాటించని వారిపై తగు చర్యలు తీసుకుంటారు.

"పోటీలు, తల్లిదండ్రుల దినోత్సవం, ఉపాధ్యాయుల దినోత్సవం చివరకు వక్తృత్వ పోటీల సందర్భంగా కూడా విద్యార్థులు పాకిస్తానీ, భారతదేశ సినిమా పాటలకు డాన్సులు చేయడం ఆనవాయతీగా వస్తోంది" అని ప్రభుత్వ నోటీసు పేర్కొంది. అయితే ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం, సందర్భంతో పనిలేకుండా పాఠశాలల్లో డాన్సులు చేయడం నిషిద్ధం. ఈ నిషేధాజ్ఞలు పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రెండింటికీ వర్తిస్తాయి. నిషేధం సక్రమంగా అమలయ్యేలా చూడాలని ప్రావిన్స్ సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
Pakistan's Punjab province
The Express Tribune
Dance
Teachers' day

More Telugu News