raviteja: 'నేల టికెట్' ఫస్టులుక్ రిలీజ్ డేట్

  • రవితేజ హీరోగా 'నేల టికెట్ '
  • కథానాయికగా మాళవిక శర్మ  
  • ఉగాది రోజున ఫస్టులుక్  

దర్శకుడు కల్యాణకృష్ణ ఇంతకు ముందు చేసిన 'సోగ్గాడే చిన్నినాయనా' .. ' రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలు యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఆయన ఆ మార్క్ ను వదలకుండగా .. రవితేజతో 'నేల టికెట్'ను చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ తదితరులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

 రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా ఫస్టులుక్ కోసం రవితేజ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో, మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

More Telugu News