రాహుల్ వ్యాఖ్యలతో రాజీవ్ గాంధీ హత్యపై అనుమానాలు... సుపారీ ఇచ్చి చంపించి ఉంటారు: సుబ్రహ్మణ్య స్వామి
- మాజీ ప్రధానిని చంపిన వారి పట్ల దయ ఎందుకు
- శిక్ష విధించింది మాజీ ప్రధానిని హత్య చేసిన వారికి
- రాజీవ్ గాంధీ హత్యపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్
‘‘ఆయన (రాజీవ్ గాంధీ) అచ్చమైన జాతీయ వాది. ఆయన హత్యకు బాధ్యులైన వారిలో ఏ విధేయత లేదు. మన మాజీ ప్రధానిని హత్య చేసేందుకు విదేశీయులతో కలసి పనిచేసిన వారి పట్ల ఎందుకు సానుకూలత చూపించాలో నాకు అర్థం కావడం లేదు. రాహుల్ ప్రకటన దేశభక్త రహితమే. మాజీ ప్రధాని హంతకులకు శిక్ష విధించారని రాహుల్ అర్థం చేసుకోవాలి. ఆయన తండ్రికి అని కాదు’’ అని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.