psl: అఫ్రిదీ వేసిన బంతికి బౌల్డై బిత్తరపోయిన పోలార్డ్

  • ముల్తాన్‌ సుల్తాన్స్‌, కరాచీ కింగ్స్‌ మధ్య మ్యాచ్
  • నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు, 18 రన్స్ ఒక మెయిడెన్ ఓవర్ వేసిన అఫ్రిదీ
  • సైఫ్ బాబర్ ను దూషించిన అఫ్రిదీ

పాకిస్థాన్‌ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ ఆటగాడు, ఆల్‌ రౌండర్‌ షాహిద్ అఫ్రీది అద్భుతమైన బంతులతో ఆకట్టుకున్నాడు. పీఎస్ఎల్ లో అఫ్రీది సంధించిన బంతికి బౌల్డ్ అయిన పొలార్డ్ బిత్తరపొయాడు. దాని వివరాల్లోకి వెళ్తే..పీఎస్ఎల్ లో భాగంగా దుబాయ్‌ లో ముల్తాన్‌ సుల్తాన్స్‌, కరాచీ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ జట్టు 188 పరుగుల చేసింది. అనంతరం బౌలింగ్ చేసిన కరాచీ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ జట్టును కేవలం 125 పరుగులకే ఆలౌట్ చేసింది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అఫ్రిది ఒక మెయిడెన్ ఓవర్ తో మూడు వికట్లు తీసుకుని, 18 పరుగులే ఇచ్చాడు. పోలార్డ్‌ కు అఫ్రిదీ వేసిన బంతి ఊహించని టర్న్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. దీంతో పొలార్డ్ బిత్తరపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అనంతరం షోయబ్‌ మాలిక్‌, సైఫ్‌ బాబర్‌ లను అఫ్రిదీ అవుట్ చేశాడు. బాబర్ ను అవుట్ చేసిన తరువాత అఫ్రిదీ దురుసుగా ప్రవర్తించాడు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో స్పందించిన బాబర్..ఇప్పటికీ షాహిద్ భాయ్ అంటే ఇష్టమేనని చెప్పాడు. దీంతో అఫ్రిదీ అతనికి క్షమాపణలు చెప్పాడు.  

More Telugu News