చెన్నై ట్రాఫిక్ పోలీసులపై ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేసిన సినీ నటి

  • కారులో బయటకు వెళ్తున్న సాయి గాయత్రి
  • సిగ్నల్ దాటావంటూ కారు ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్
  • 300 రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్
గర్భిణి మృతి ఘటన తర్వాత చెన్నై ట్రాఫిక్ పోలీసులంటే భయం వేస్తోందని సినీ నటి సాయి గాయత్రి తెలిపింది. ట్రాఫిక్ పోలీసులు అకారణంగా తన కారుని ఆపి డబ్బులు డిమాండ్ చేశారని మండిపడింది. తమిళనాడు రాజధానిలో ట్రాఫిక్ పోలీసుల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. దాని వివరాల్లోకి వెళ్తే... చెన్నైలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో కారణం లేకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ తన కారును ఆపారని సాయి గాయత్రి తెలిపింది. సిగ్నల్ క్రాస్ చేశావంటూ 300 రూపాయలు డిమాండ్ చేశారని పేర్కొంది. దీంతో తాను ‘మీ పేరు చెప్పండి’ అని అడగడంతో ‘సర్లే 100 ఇవ్వు’ అని డిమాండ్ చేశారని తెలిపింది. దీంతో మళ్లీ తాను ‘నీ పేరేంటో చెప్పు’ అని అడగడంతో ‘మీరెవరు మేడమ్’ అని అడిగాడని చెప్పింది. ‘కారణం లేకుండా వేధింపులకు గురవుతున్న చెన్నై పౌరురాలిన’ని తాను చెప్పడంతో క్షమించమని చెప్పి వెళ్లమన్నాడని సాయి గాయిత్రి తెలిపింది. కాగా, సాయి గాయత్రి మణిరత్నం అంజలి సినిమాలో నటించింది. 
Go Back to Shorts
chennai
Tamilnadu
traffic police
harassment

More Telugu News