నాన్న చనిపోతాడని ముందే తెలుసు: రాహుల్ గాంధీ
- తప్పుడు శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తే మరణం తప్పదని వ్యాఖ్య
- తన తండ్రిని చంపిన వారిని పూర్తిగా క్షమించేశామని వెల్లడి
- సింగపూర్ లో ఐఐఎం పూర్వ విద్యార్థులతో రాహుల్ భేటీ
ఎల్ టీటీఈ అధినేత ప్రభాకరన్ చనిపోయినప్పుడు టీవీలో అతడి మృతదేహాన్ని చూశానని, ఆ సమయంలో తనకు రెండు రకాల భావాలు కలిగాయని రాహుల్ గాంధీ చెప్పారు. ‘‘ఒకటేమిటంటే.. వాళ్లు (శ్రీలంక ప్రభుత్వం) ప్రభాకరన్ తో అలా ఎందుకు అవమానకరంగా వ్యవహరించారు అనిపించింది. ఇక ప్రభాకరన్ గురించి, అతని పిల్లల గురించి ఆలోచిస్తే బాధనిపించింది. ఏదైనా హింసాత్మక ఘటన జరిగినప్పడు దాని వెనుక కచ్చితంగా ఓ మనిషి ప్రమేయం ఉంటుంది. ఓ కుటుంబం ఉంటుంది, ఓ చిన్నారి రోదన ఉంటుంది. అలాంటి బాధను నేను కూడా అనుభవించాను. మనుషులను ద్వేషించడం చాలా కష్టం..’’ అని పేర్కొన్నారు.