'సమ్మోహనం' రిలీజ్ డేట్ ఖరారైపోయింది

10-03-2018 Sat 16:23
  • సుధీర్ బాబు హీరోగా 'సమ్మోహనం'
  • ఆయన సరసన అదితీరావు 
  • జూన్ 15వ తేదీన విడుదల
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పేరు వినగానే 'అష్టా చమ్మా' .. ' జెంటిల్ మేన్' .. 'అమీతుమీ ' సినిమాలు గుర్తుకొస్తాయి. బలమైన కథాకథనాలతో వినోదానికి ప్రాధాన్యతనిచ్చే ఆయన, తాజాగా 'సమ్మోహనం' అనే సినిమా చేస్తున్నాడు.

సుధీర్ బాబు హీరోగా ... అదితీరావు హీరోయిన్ గా ఈ సినిమా రూపొందుతోంది. జూన్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. యూత్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే కథాకథనాలతో ఈ సినిమాను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. కుటుంబం .. ప్రేమ మధ్య చోటుచేసుకునే భావోద్వేగాలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. ఈ సినిమా సుధీర్ బాబుకు సక్సెస్ ను తెచ్చి పెట్టడం ఖాయమనేది యూనిట్ సభ్యుల మాట.