serena williams: తప్పనిసరి పరిస్థితుల్లోనే డ్రగ్స్ తీసుకున్నాను: సెరేనా విలియమ్స్

  • ఇండియన్ వేల్స్ తొలి రౌండ్ లో జరీనా డయాస్‌ (కిర్గిస్థాన్‌)పై 7-5, 6-3 స్కోరుతో విజయం సాధించిన సెరేనా విలియమ్స్
  • 2015 డ్రగ్స్ ఘటనపై వివరణ
  • నేనేనాడూ నిషిద్ధ ఉత్ర్పేరకాలు వాడలేదు

తప్పని సరి పరిస్థితుల్లోనే తాను గతంలో డ్రగ్స్ వినియోగించాల్సి వచ్చిందని దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ తెలిపింది. ఇండియన్ వేల్స్ టోర్నీ తొలి రౌండ్ లో జరీనా డయాస్‌ (కిర్గిస్థాన్‌)పై 7-5, 6-3 స్కోరుతో విజయం సాధించిన తరువాత... 2015 ఫ్రెంచ్‌ ఓపెన్‌ సందర్భంగా డ్రగ్స్‌ వినియోగించాల్సి రావడంపై వివరణ ఇచ్చింది. ఆ సమయంలో తను తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో, తప్పని సరి పరిస్థితుల్లో యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనుమతితో చికిత్సలో డ్రగ్స్ వినియోగించాల్సి వచ్చిందని తెలిపింది. క్రీడాకారులు అనారోగ్యం పాలైనప్పుడు చికిత్సలో డ్రగ్స్‌ ఉపయోగించాల్సి వస్తే వరల్ద్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, రిపోర్ట్స్ పరిశీలించిన తరువాత అధికారులు అనుమతిస్తే వాడొచ్చని తెలిపింది. దానిని క్రీడారంగంలో ‘చికిత్సలో డ్రగ్స్‌ వాడేందుకు మినహాయింపు‘ (ట్యూ) గా పేర్కొంటారని తెలిపింది. అందుకే వైద్యులు సూచించిన డ్రగ్స్ వినియోగిస్తే తప్ప తాను అప్పటి టోర్నీల్లో ఆడలేకపోయానని వెల్లడించింది. అంతే తప్ప తానేనాడూ నిషిద్ధ ఉత్ర్పేరకాలు వాడి పట్టుబడలేదని స్పష్టం చేసింది

More Telugu News