Smart Phones: ఈ వారంలో భారీగా తగ్గనున్న స్మార్ట్ ఫోన్ ధరలు... వివరాలివి!

  • కొత్త ఫోన్ కొనాలని భావించే వారికి శుభవార్త
  • తగ్గనున్న స్మార్ట్ ఫోన్ ధరలు
  • రూ. 18,900కే శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రో

కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మూడు నాలుగు రోజులు ఆగితే మీకు మరింత లాభం కలుగుతుంది. శాంసంగ్, నోకియా, వీవో తదితర స్మార్ట్ ఫోన్ సంస్థలు తామందిస్తున్న ప్రొడక్టులపై 15 నుంచి 30 శాతం వరకూ తగ్గింపును ప్రకటించనున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, మరో వారం రోజుల వ్యవధిలో 7 స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రో ధర రూ. 2 వేలు తగ్గి రూ. 18,900కు అందుబాటులోకి రానుంది. 5.5 అంగుళాల స్క్రీన్, ఆక్టా కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 64 జీబీ మెమొరీ, ఆండ్రాయిడ్ నోగట్ 7.0 సిస్టమ్ ఉంటాయి.
నోకియా 6 ధర రూ. 1,500 తగ్గి రూ. 13,499కి లభించనుంది. 3 జీబీ ర్యామ్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8. ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, 5.5 అంగుళాల స్క్రీన్ ఉంటాయి.
శాంసంగ్ జే 7 మ్యాక్స్ ధర రూ. 3 వేలు తగ్గి రూ. 11,900కు లభించనుంది. నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్, మీడియాటెక్ హీలియో పీ20 ప్రాసెసర్, 5.7 అంగుళాల డిస్ ప్లే, 13/13 ఎంపీ కెమెరాలు దీని ప్రత్యేకత.
వీవో వీ7 ప్లస్ రూ. 2 వేల డిస్కౌంట్ తో రూ. 19,990కు అందుబాటులోకి రానుంది. 24 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్ దీని ప్రత్యేకతలు.
వివో వై53 ధర రూ. 500 తగ్గి రూ. 8,499కి మార్కెట్లోకి రానుంది. ఆండ్రాయిడ్ మార్ష్ మాలో సిస్టమ్ పై పనిచేసే ఫోన్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 16 జీబీ మెమొరీ, 8/5 ఎంపీ కెమెరాలు ఉంటాయి.
ఇన్ఫినిక్స్ జీరో 5 ధర రూ. 2 వేలు తగ్గి రూ. 15,999కి దిగిరానుంది. ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉండే ఫోన్ పై, హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డులు వాడి కొనుగోలు చేస్తే, మరో 10 శాతం రాయితీ లభిస్తుంది. 5. అంగుళాల స్క్రీన్, 12/13 ఎంపీ కెమెరాలు ఉంటాయి.
ఇన్ఫినిక్స్ నోట్ 4 ధర రూ. 1000 తగ్గి రూ. 7,999కి రానుంది. ఇది కూడా ఫ్లిప్ కార్ట్ లోనే లభిస్తుంది. 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే ఫోన్ లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీ, 13/8 ఎంపీ కెమెరాలుంటాయి.

More Telugu News