Brahmanandam: ఈ నెల 11న మహబూబ్‌నగర్‌లో మరో బిరుదు అందుకోనున్న బ్రహ్మానందం

  • ‘కాకతీయ కళావైభవ మహోత్సవం’ పేరిట మహబూబ్‌నగర్‌లో ఓ కార్యక్రమం
  • ‘హాస్య నటబ్రహ్మ’ బిరుదుతో బ్రహ్మానందానికి ఘనంగా సత్కారం
  • హాజరుకానున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, మంత్రులు

సుమారు 1100కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన బ్ర‌హ్మానందంకు మ‌రో బిరుదు రాబోతోంది. ఆయ‌న‌ను ఈ నెల 11న ‘హాస్య నటబ్రహ్మ’ బిరుదుతో ఘనంగా సత్కరించనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ నెల 11న ‘కాకతీయ కళావైభవ మహోత్సవం’ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించనున్నారు. అలనాటి కాకతీయ సామ్రాజ్యంలో కళలకు ఎంతటి ప్రాధాన్యత ఉండేదో తెలియజేసేందుకు ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అందులో బ్రహ్మానందంకు ఈ బిరుదు ప్రదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

More Telugu News