Priya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ప్రియా ప్రకాశ్ పాత్రలో ఎవరో!
  • మరో తెలుగు సినిమాలో 'కిరాక్ పార్టీ' నాయిక
  • 'తొలిప్రేమ' దర్శకుడితో అఖిల్?

*  మలయాళ లేటెస్ట్ సెన్సేషన్ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన తొలి చిత్రం 'ఒరు ఆదార్ లవ్'ను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను వీకేఏ ఫిలిమ్స్ సంస్థ భారీ రేటుకి సొంతం చేసుకుంది. మరి, ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారా? లేక డబ్బింగ్ చేస్తారా? అన్నది చూడాలి. రీమేక్ చేస్తే ప్రియా పాత్రను ఎవరు పోషిస్తారో!    
*  తాజాగా 'కిరాక్ పార్టీ' చిత్రంలో కథానాయికగా నటించిన సిమ్రన్ పరీన్జా ఆ సినిమా విడుదల కాకుండానే మరో తెలుగు చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. నాగ శౌర్య హీరోగా శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో సిమ్రన్ నాయికగా ఎంపికైంది.
*  'హలో' సినిమా తర్వాత అఖిల్ అక్కినేని నటించే సినిమా ఏమిటన్న విషయంలో ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఈ విషయంలో రకరకాల దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ ఏదీ ఫైనల్ కాలేదు. ఈ క్రమంలో ఇటీవల 'తొలిప్రేమ' సినిమాతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నట్టు తాజాగా వార్తలొస్తున్నాయి.

More Telugu News